లేడీ సూపర్ స్టార్ నయనతార ఎంత కమర్షియల్ అనేది అందరికి తెలుసు. తన కోసం కాకుండా ఇతరుల కోసం ఏ చిన్న పని చేసినా అందులో లాభం ఎంతుంటుంది అని చూసుకుంటుంది. సినిమాలకు భారీ పారితోషికాలు డిమాండ్ చేస్తుంది, కానీ ప్రమోషన్స్ కి రాదు, ఏదన్నా అంటే సెంటిమెంట్ అంటూ కవరింగ్.
అలాంటి కమర్షియల్ నయనతారను అనిల్ రావిపూడి సినిమా మొదలు కాకముందే పడేసాడు. అనిల్ రావిపూడి #Mega157 అంటూ మెగాస్టార్ తో సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టి ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లే సందర్భంలో నయనతార ను #Mega157 ప్రాజెక్ట్ లోకి ఆహ్వానిస్తూ చేసిన వీడియో చూసి అందరూ షాకవుతున్నారు. నయనతార లాంటి కమర్షియల్ హీరోయిన్ తో అనిల్ రావిపూడి సినిమా మొదలు పెట్టకముందే వీడియో చేయించి దానిని వదలడం అందరికి ఆశ్చర్యమే.
మేకప్ వేసుకుంటూ, కార్ లో మెగాస్టార్ సాంగ్స్ వింటూ, తెలుగు మట్లాడుతూ, #Mega157 స్క్రిప్ట్ పేపర్స్ చూస్తూ.. అనిల్ రావిపూడితో కలిసి స్టార్ట్ అవుతుంది, సంక్రాంతికి వస్తున్నాం అంటూ అనౌన్స్ చేసిన వీడియో చూసి అనిల్ రావిపూడి సామాన్యుడు కాదు, నయన్ లాంటి హీరోయిన్ ని ప్రీ ప్రమోషన్స్ కి భలేగా వాడేసాడు అంటూ మాట్లాడుకుంటున్నారు.