పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తి కాగా, రెండు రోజుల క్రితమే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG సెట్ లోకి పవన్ వెళ్లారు, దానితో ఆ రెండు సినిమాల షూటింగ్స్ విషయంలో మేకర్స్ కి టెన్షన్ లేదు.
ఇక ఆ రెండింటితో పాటుగా పవన్ కళ్యాణ్ దర్శకుడు హారిష్ శంకర్ తో చెయ్యాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా పూర్తి చేస్తారనే టాక్ ఉండగా.. గతంలో హారిష్-పవన్ సినిమాపై సోషల్ మీడియాలో ఎంత నెగిటివిటి చూపించారో, మరోసారి అంటే ఇప్పుడు సినిమా పట్టాలపైకి వెళుతుంది అనగానే అంతే నెగిటివిటీని ఉస్తాద్ భగత్ సింగ్ పై చూపిస్తూ వేస్తున్న ట్వీట్లు చూసి పవన్ సినిమాపై ఇంత నెగిటివిటినా అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.
దర్శకుడు అట్లీ నే డైరెక్ట్ గా డీల్ చేసి అడాప్షన్ అని చెప్పి తీసిన తేరి రీమేక్ బేబీ జాన్ షెడ్ కి వెళ్ళింది అంటే... తుప్పు పట్టిన స్క్రిప్ట్ పేపర్లు మళ్లీ బయటకు తీసి, హీరో నుంచి హీరోయిన్ల వరకు ఒక్కరికి కూడా హిట్స్ లేని పరిస్థితిలో... చివరి సినిమా తీసి దశాబ్దం దాటిన డైరెక్టర్‌ని రైటర్‌గా పెట్టుకొని.. చివరి సినిమా తో సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ అయిన డైరెక్టర్(హరీష్ శంకర్)తో కొన్ని రోజుల్లో పట్టాలెక్కబోతున్న సినిమా(ఉస్తాద్ భగత్ సింగ్) ఎంత దారుణంగా ఉంటుందో చూడాలి!.. అంటూ దారుణమైన ట్వీట్లు వెయ్యడం పై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.