యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్, దేవర తర్వాత హిందీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 తో హిందీ డెబ్యూ రెడీ చేసుకున్న ఎన్టీఆర్ ఆపై హృతిక్ రోషన్ తో చాలామంది అనుబంధాన్ని మైంటైన్ చేస్తున్నారనిపించేలా వారి మద్యన సోషల్ మీడియా బ్రోమాన్స్ కనిపిస్తుంది. హృతిక్ రోషన్ పదే పదే ఎన్టీఆర్ టాలెంట్ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, అలాగే ఎన్టీఆర్ వంట పై రియాక్ట్ చెబుతూ నార్త్ ఆడియన్స్ లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతున్నారు .
ఇప్పుడు కూడా మే 20 న ఎన్టీఆర్ కి ఊహించని సర్ ప్రైజ్ వార్ 2 తో ఇవ్వబోతున్నట్టుగా హృతిక్ రోషన్ సోషల్ మీడియా వేదికగా వేసిన ట్వీట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. థాంక్యూ హృతిక్ రోషన్ సర్.. మీరిచ్చే గిఫ్ట్ గురించి తెలుసుకోవాలని ఉంది. నిన్ను వేటాడి దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు వేచి చూస్తున్నా అంటూ ఎన్టీఆర్, హృతిక్ కి రిప్లై ఇచ్చారు.
హృతిక్ ఎన్టీఆర్ బర్త్ డే కి ఊహించని ట్రీట్ ఇస్తానంటే దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు వెయిట్ చేస్తున్నా కబీర్ అంటూ ఎన్టీఆర్ ట్వీట్స్, అలాగే వారి మద్యన అనుబంధాన్ని చూసిన నెటిజెన్లు.. అన్నదమ్ముల అనుబంధం లాఉంది, ఎన్టీఆర్-హృతిక్ ల బ్రోమాన్స్ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.