యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే కి ఏంతో సమయం లేదు. మే 20 ఎన్టీఆర్ బర్త్ డే. ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లిన ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలను ఎక్కడ జరుపుకుంటారో తెలియదు కానీ, ఆయన అభిమానులు మాత్రం ఎన్టీఆర్ కొత్త చిత్రాలు నుంచి ఊహించని ట్రీట్స్ కావాలని కోరుకుంటున్నారు.
అందుకు ఎన్టీఆర్ తో పని చేస్తున్న దర్శకులు ప్రశాంత్ నీల్ తో పాటుగా కొరటాల కూడా సిద్ధమవుతున్నారు. కానీ ఎన్టీఆర్ హిందీలోకి ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ ల వార్ 2 నుంచి ఎన్టీఆర్ బర్త్ డే కి సర్ ప్రైజ్ ఉంటుందా, లేదంటే అనే మీమాంశ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొట్టేసుకుంటున్నారు. తాజాగా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం వార్ 2 నుంచి స్పెషల్ అప్ డేట్ మోసుకొచ్చారు.
తారక్ ఈనెల 20న ఏం జరబోతోందో తెలుసా? నీకు కూడా ఐడియా లేదేమో? ఊహించని సర్ ప్రైజ్ కోసం వెయిట్ చేస్తూ రెడీగా ఉండు అంటూ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ అభిమానుల కోసం వేసిన ట్వీట్ వైరల్ గా మారడం కాదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ హృతిక్ రోషన్ కి థాంక్స్ లు చెప్పేస్తున్నారు.
సో మే 20 కి వార్ 2 నుంచి స్పెషల్ ట్రీట్ రెడీ అవుతుంది. ఇక ఎన్టీఆర్-నీల్ డ్రాగన్ నుంచి స్పెషల్ గ్లింప్స్ వదిలేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.