టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా 100, 300 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టిన మీనాక్షి చౌదరి ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్లబోతుంది. అక్కడ కూడా ఆమె క్రేజీ నిర్మాణ సంస్థతో కలిసి హిందీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ లుక్ షేర్ చేసే మీనాక్షి చౌదరి తాజాగా శారీ లుక్ పోస్ట్ చేసింది.
వైలెట్ కలర్ వర్క్ శారీ లో ఆలివ్ గ్రీన్ డిజైనర్ బ్లౌజ్ తో మీనాక్షి చౌదరి అందాలు ఎంతగా హైలెట్ అయ్యాయి అంటే.. చీర కట్టులోనూ అందాలు ఇంతిలా చూపించొచ్చా అన్నంతగా మీనాక్షి శారీ అందాలు ఉన్నాయి. చక్కటి నవ్వుతో మీనాక్షి చౌదరి చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది.
ప్రస్తుతం తెలుగు లో అనగనగా ఒక రాజు చిత్రం చేస్తున్న మీనాక్షి హిందీ ప్రాజెక్ట్ లోకీ ఎంటర్ అయ్యే సమయం అస్సన్నమైంది. ఇకపై సౌత్ ప్రేక్షకులతో పాటుగా నార్త్ ఆడియన్స్ కూడా మీనాక్షి అందాలను వీక్షించొచ్చన్నమాట.