యంగ్ టైగర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ కలయికలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డు ని గెలుచుకుని ఇండియన్ సినిమా స్థాయి పెంచడమే కాదు టాలీవుడ్ ని ప్రపంచ పటంలో కనబడేలా చేసింది. ఇప్పటికి అంటే ఆర్ఆర్ఆర్ విడుదలైన మూడేళ్లకు కూడా ఇంకా ఇంకా వార్తల్లో నిలుస్తున్న చిత్రంగా రికార్డ్ సృష్టించింది.
తాజాగా లండన్ లో రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్‌లో భాగంగా ఎన్టీఆర్-రామ్ చరణ్ ల స్నేహం మరింతగా హైలెట్ అవ్వగా ఈ ఇద్దరు రాజమౌళి తో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసారు. ముగ్గురు కలిసి సందడి చేసిన వీడియోస్ ఫొటోస్ ను రామ్ చరణ్ భార్య ఉపాసన షేర్ చేసారు. ఆ వీడియో లో ఆర్ఆర్ఆర్ 2 ఎప్పుడు చేస్తారని అడుగగా..
రాజమౌళి తప్పకుండా చేస్తాం అంటూ సమాధానమిచ్చిన వీడియో చూసి ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఫుల్ గా ఎగ్జైట్ అవుతున్నారు. గతంలో ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుంది అన్నా అది ఇప్పుడప్పుదే పోజిబుల్ అవ్వదని అందరూ ఫిక్స్ అయిన సమయంలో మరోసారి ఆర్ఆర్ఆర్ 2 పై రాజమౌళి క్లారిటీ వివాదం అందరికి హ్యాపీ గా అనిపించింది.