బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఇటీవలే ఎన్బీకే సరసన `దబిడి దిబిడి` పాటలో నర్తించిన సంగతి తెలిసిందే. ఈ పాట ఒక కోణంలో ఊర్వశిని బాగా అన్ పాపులర్ చేస్తే, మరో కోణంలో గ్లోబల్ వెబ్ లో విపరీతమైన ప్రచారం కూడా తెచ్చింది. అసలు ఊర్వశి ఎవరో తెలియని కొన్ని కొత్త రెజియన్లలోను తన పేరు ఇప్పుడు తెలుసు.
అందుకే ఊర్వశి ఏం చేస్తున్నా, తనపై ఇతరుల దృష్టి ఉంటుంది. ఇప్పుడు కేన్స్ 2025 ఉత్సవాల్లో మొదటి రోజు తన ప్రదర్శనతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఊర్వశి పూర్తిగా ముదురు రంగు మేకప్ తో కనిపించింది. ఎంపిక చేసుకున్న దుస్తులు కూడా ఎంతగానో ఆకర్షించాయి. వీటన్నిటినీ మించి ఊర్వశి చేతిలో చిలుక ఆకారంలోని హ్యాండ్ బ్లాగ్ అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. క్రిస్టల్స్ తో డిజైన్ చేసిన ఈ స్లింగ్ బ్యాగ్ సింపుల్ గా ఉన్నా కానీ, దానికోసం చేసిన వర్క్ ఇంప్రెస్ చేసింది. ఈ బ్యాగ్ ధర సుమారు 4.7లక్షలు.
అయితే ఊర్వశి ఎంతగా హొయలు పోయినా కానీ, తన ఫ్యాషన్ పోకడలపై ప్రశంసలు కురవకపోగా నెట్ లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఊర్వశి మరీ అతి చేస్తోందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. కేన్స్ రెడ్ కార్పెట్ ఈవెంట్లో తదుపరి ఐశ్వర్యారాయ్, ఆలియాభట్ లాంటి ప్రముఖ తారలు సందడి చేయనున్నారు.