సీనియర్ హీరో రాజశేఖర్ ప్రెజెంట్ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. శేఖర్ సినిమా తర్వాత కామ్ గా ఉంటున్న రాజశేఖర్ నితిన్ తమ్ముడు చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు మరో యంగ్ హీరో విజయ్ దేవరకొండ చిత్రంలోకి ఎంటర్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి తో కింగ్ డమ్ చేస్తున్నారు, అది జులై 4 న రిలీజ్ కి రెడీ అవుతుంది.
ఆ తర్వాత విజయ్ దేవరకొండ దిల్ రాజు బ్యానర్ లో రాజావారు రాణీగారు ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ తో పాటుగా రాహుల్ సంకీర్తన్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని అనౌన్స్ చేసారు. రౌడీ జనార్థన్ లో విజయ్ దేవరకొండ కి విలన్ పాత్ర కోసం సీనియర్ హీరో రాజశేఖర్ ని అనుకుంటున్నారట.
రీసెంట్ గా రాజశేఖర్ పై ఓ ఫొటో షూట్ కూడా చేశారని, ఫోటో షూట్ లో రాజశేఖర్ విలనీ లుక్ అన్ని సెట్ అయ్యాయని, అంతేకాకుండా ఈ చిత్రం కోసం రాజశేఖర్ కి మంచి పారితోషికం కూడా ఇవ్వబోతున్నారని అంటున్నారు. ఈ చిత్రంలో విజయ్ కి హీరోయిన్ గా ఆయన రూమర్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక నటించే ఛాన్స్ ఎక్కువగా ఉంది.