పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అత్యాశకు పోవడం లేదు. నిన్నమొన్నటివరకు హరి హర వీరమల్లు, OG చిత్రాలతో పాటుగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్స్ సందిగ్ధంలో ఉండగా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తి కాగా.. ఇప్పుడు OG సెట్ లోకి పవన్ వెళ్లిపోయారు.
OG షూటింగ్ కూడా కదులుతూ ఉండడంతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఉస్తాద్ భగత్ సింగ్ పై ఆశలు పెంచుకుంటున్నారు. ఇదే ఊపులో పవన్ ఉస్తాద్ ను కూడా పూర్తి చెయ్యాలని వారు ఆశపడుతున్నారు. హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన ఎలివేషన్స్ చూసి ఆ చిత్రంపై ఫ్యాన్స్ లో క్రేజ్ ఎక్కువైంది.
కానీ పవన్ వీరమల్లు, OG షూటింగ్స్ తో పాటుగా ఉస్తాద్ షూటింగ్ ని పక్కన పెట్టయ్యడమే కాదు, ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ హరి హార్ వీరమల్లు, OG షూటింగ్స్ మాత్రమే పూర్తి చేస్తారు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ని ఆపేసినా ఆపెయ్యోచ్చు, కారణం ఉస్తాద్ షూటింగ్ చాలా తక్కువ జరగడంతో పవన్ రాజకీయాల దృష్యా ఉస్తాద్ ని ఆపెయ్యొచ్చనే టాక్ నడిచింది.
కానీ పవన్ వీరమల్లు, OG చిత్రాలు పూర్తిచెయ్యడంతో పవన్ ఉస్తాద్ ని కూడా ఇదే ఊపులో ఫినిష్ చెయ్యాలని ఆశపడుతున్నారు. అదేమంత అత్యాశ కాదు, మరి పవన్ ఉస్తాద్ విషయంలోనూ క్లారిటీ ఇస్తే పవన్ ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీలవుతారు.