పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 AD చిత్రంతో సౌత్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకొనే.. ఆతర్వాత ప్రభాస్ తో కలిసి కల్కి 2 లో నటించాల్సి ఉంది. అదలా ఉంటే ఇప్పుడు మరోసారి దీపికా పదుకొనె ప్రభాస్ తో జోడి కట్టే అవకాశం అందుకుంది అనే న్యూస్ మొదలైంది. ప్రభాస్-సందీప్ రెడ్డి వంగ కాంబోలో మొదలు కాబోయే స్పిరిట్ లో దీపికా ని హీరోయిన్ గా అనుకుంటున్నారట.
ఇంతకుముందు బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ని ప్రభాస్ కి జోడిగా అనుకున్నారు, కానీ ఇప్పుడు దీపికా పదుకొనే అయితే బావుటుంది అని ఆమెను సంప్రదించగా.. దీపికా స్పిరిట్ లో నటించేందుకు భారీ పారితోషికం డిమాండ్ చేస్తుందట. భారీగా అంటే దాదాపుగా 20 కోట్ల పారితోషికం అడుగుతున్నట్లుగా చెబుతున్నారు.
దీపికా కు ఉన్న క్రేజ్ దృష్యా నిర్మాతలు దీపికా కు 20 కోట్లు చెల్లిస్తారో, లేదంటే మరో హీరోయిన్ కోసం ట్రై చేస్తారో తెలియదు కానీ.. ప్రభాస్-సందీప్ రెడ్డి స్పిరిట్ మొదలయ్యే క్షణాల కోసం పాన్ ఇండియా ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. జూన్ మిడ్ నుంచి స్పిరిట్ మొదలయ్యే ఛాన్స్ ఉంది అనే టాక్ ఉంది. చూద్దాం స్పిరిట్ ఎప్పుడు కదులుతుందో అనేది.!