ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి చాలా గ్యాప్ తో రాబోతున్న చిత్రం భైరవం. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సోలో హీరో కాదు. మంచు మనోజ్, నారా రోహిత్ వంటి హీరోలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. బెల్లంకొండ నటించిన భైరవం చిత్రం మే 30 అంటే ఈనెలలోనే విడుదల కాబోతుంది.
తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ కారు ఓ కానిస్టేబుల్ పైకి దూసుకువెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలు ఏం జరిగింది అంటే బెల్లంకొండ శ్రీనివాస్ డ్రైవ్ చేస్తున్న కారు జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద రాంగ్ రూట్ లో కార్ తో ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకొచ్చిన వీడియో వైరల్ గా మారింది.
రాంగ్ రూట్ లో వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ను కానిస్టేబుల్ అడ్డుకుని నిలదీయటం తొ అక్కడి నుంచి శ్రీనివాస్ సైలెంట్ గా వెళ్లిపోయిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. యువతకు ఆదర్శంగా నిలిచే సినీహీరోలే ఈ విధమైన తప్పులు చెయ్యడం పట్ల నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.