ఈమధ్యన అనారోగ్య సమస్యలతో సతమతమైన కొడాలి నాని ప్రస్తుతం ముంబైలోనే ఉంటున్నారు. హైదరాబాద్ AIG ఆసుపత్రి నుంచి హడావిడిగా ముంబైకి వెళ్లి అక్కడ గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న కొడాలి నాని ఇంకా ముంబై లోనే ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవిని అనుభవిస్తూ ఇష్టానురీతిలో చెలరేగిపోయి ప్రతిక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై నోరు పారేసుకుని, అధికారం దూరమవ్వగానే రాజకీయాలకు అంటీముట్టనట్టుగా ఉన్న కొడాలి నాని ఏకాకిగా మారబోతున్నాడా?
అదే నిజమనుకునేలా కొడాలి నాని కి అత్యంత ఆప్తుడు కృష్ణా జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాసిం రాజకీయాలకు దూరమవుతున్నట్టుగా ప్రకటించడం కొడాలి నానికి షాకిచ్చే విషయమే. ఇంకా షాకిచ్చే విషయం ఏమిటంటే తాము కొడాలి నాని వైఖరితో విసిగిపోయామని, నానిని నమ్మి మోసపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.
కొడాలి నాని ని నమ్ముకుని గుడివాడ ఎమ్మెల్యే రాముపై అసత్య ప్రచారాలు చేశామని, ఎన్నికల ముందు రాముపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు చెబుతున్నట్లుగా ఆయన ప్రకటించారు. పార్టీనే నమ్ముకున్న నాయకులను, కార్యకర్తలను కొడాలి నాని పట్టించుకోకోలేదని, కనీసం వరదల్లో సర్వం కోల్పోతే పరామర్శకు కూడా రాలేదని, ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే కనీసం అటువైపు చూడలేదన్నారు.
గుడివాడ ఎమ్యెల్యే రాము నిత్యం ప్రాజాల్లో తిరుగుతూ రాజకీయాలకు కొత్త అర్ధం చెప్పారని, ఏనాడూ కొడాలి నాని గుడివాడ ప్రజలను పట్టించుకోలేదని, మమ్మల్ని మోసం చేసి తప్పుదోవ పట్టించిన కొడాలి నాని ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో కూడా తెలియడం లేదని, ఇకపై రాజకీయాల్లో ఉండలేను అని ఖాసీం ప్రకటించారు.
ఇలా చూసుకుంటే ఒక్కొక్కరిగా కొడాలి అనుచరులు నానికి దూరమవుతున్నారానిపిస్తుంది. ఇకపై కొడాలి నాని నిర్ణయమేమిటో చూడాలి.