తెలుగులో వరస ప్లాప్ లతో సతమతమవుతున్న క్యూట్ బ్యూటీ శ్రీలీల కు పుష్ప 2 కిస్సింగ్ సాంగ్ ఎంత హెల్ప్ అయ్యింది అంటే.. శ్రీలీలను బాలీవుడ్ రా రమ్మంటుంది. అక్కడ శ్రీలీలకు వరస ఆఫర్స్ రావడం నిజంగా షాకిచ్చే విషయమే. పుష్ప 2 సాంగ్ తర్వాత రాబిన్ హుడ్ తో శ్రీలీల మళ్లీ డిజప్పాయింట్ చేసింది.
కానీ అప్పటికే ఆమెకు కార్తీక్ ఆర్యన్ లాంటి క్రేజీ హీరోతో కలిసి హిందీలో ఆషీకీ 3 లో ఛాన్స్ వచ్చింది. అంతేకాదు సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తోనూ ఆమెకి సినిమా ఛాన్స్ వచ్చింది అనే టాక్ నడిచింది. ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ క్రేజీ ఆఫర్ శ్రీలీల తలుపు తట్టింది అనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది.
అది జాన్వీ కపూర్ చెయ్యాల్సిన దోస్తానా 2 లో జాన్వీ ని కాదని మేకర్స్ శ్రీలీల కు అవకాశమిచ్చినట్లుగా బాలీవుడ్ లో కథనాలు కనబడుతున్నాయి. ప్లాప్ హీరోయిన్ కి బాలీవుడ్ లో వరస అవకాశాలు రావడం మాములు విషయం కాదు. కానీ అందానికి అందం, డాన్స్ కు డాన్స్ ఉన్న శ్రీలీలకు ప్రస్తుతం సౌత్ లో బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి. కానీ హిందీ మాత్రం అమ్మడిని నెత్తిన పెట్టుకుంటుంది.
ప్రస్తుతం తెలుగులో అఖిల్ లెనిన్ చిత్రంతో పాటుగా రవితేజ తో మాస్ జాతర చేస్తుంది. మరోపక్క కోలీవుడ్ లో శివకార్తికేయన్ తో పరాశక్తిలో నటిస్తున్న శ్రీలీలను మాత్రం బాలీవుడ్ రారమ్మని పిలుస్తుంది.