యాంకర్ కం నటి అనసూయ భరద్వాజ్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు, 40 ప్లస్ ఏజ్ లోను అనసూయ అందాలను ఆస్వాదించే యువకులు ఉండరు అంటే నమ్మాలి. హీరోయిన్స్ కి గ్లామర్ గా పోటీ ఇచ్చే అనసూయ ఫ్యామిలీ తో టైమ్ స్పెండ్ చేసినా దానిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. కొడుకులతో కలిసి స్విమ్ చేసినా లేదంటే భర్త తో కలిసి వెకేషన్ కి వెళ్లినా ఏదైనా సరే సోషల్ మీడియాలోకి చేర్చాల్సిందే.
ఇక పూజలు పునస్కారాలు ఎక్కువగా చేసే అనసూయ తాజాగా న్యూ బిగినింగ్ అంటూ తన నూతన గృహ ప్రవేశ ఫొటోస్ ని షేర్ చేసింది. భర్త భరద్వాజ్, పిల్లలు, అనసూయ కలిసి కొత్తింట్లోకి అడుగుపెడుతున్న పిక్స్ షేర్ చేసింది. చక్కటి ట్రెడిషనల్ వేర్ లో అనసూయ ఫ్యామిలీతో కలిసి రాయల్ గా కనిపించింది.
ఇక అనసూయ కొత్తిల్లు కూడా చాలా గ్రాండ్ గా రాయల్ హౌస్ లానే కనబడుతుంది. తన కొట్టింటికి #SriRamaSanjeevani శ్రీరామ సంజీవిని అని పేరు పెట్టినట్లుగా చెప్పుకొచ్చింది. తన కొత్తింట్లో పలు ప్రదేశాల్లో అనసూయ ఫ్యామిలీతో కలిసి ఫోటోలకు ఫోజులివ్వగా అవి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.