పాకిస్తాన్ కి తగిన విధంగా బుద్ధి చెప్పినా అది కుక్క తోక వంకరగానే ప్రవర్తిస్తుంది. ప్రశాంతగా ఉన్న జమ్మూ కాశ్మీర్ పహాల్గమ్ లో ఉగ్రదాడికి తెగబడి అమాయకులైన ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడమే కాదు, భరత్ పై దొంగ దెబ్బ తీసేందుకు గోతికాడ నక్కలా కాచుకుని కూర్చున్న పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ పేరుతొ బుద్ది వచ్చేలా చేసారు ఇండియన్ ఆర్మీ. ఆ తర్వాత మూడు రోజులకే కాళ్ళ బేరానికి వచ్చి మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని బ్రేక్ చేసింది పాక్.
ఆపరేషన్ సిందూర్ మొదలైన తర్వాత తొలి సారి పీఎం మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇండియా-పాక్ నడుమ ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను వివరించారు. పాక్ ఉగ్రవాదులపైనే ఇండియన్ ఆర్మీ దాడి చేసింది, కానీ పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతుగా ఉంటూ మనపై ఎదురుదాడి చేసిందని, పాకిస్తాన్ కు నేరుగా బుద్ది చెప్పామని మూడు రోజుల్లోనే పాక్ కాళ్ల బేరానికి వచ్చిందని తెలిపారు.
పాకిస్తాన్ పై ఓ కన్నేసి ఉంచామని, అణుదాడి చేస్తామని బెదిరిస్తే సహించేది లేదన్నారు. అంతేకాదు మోడీ మాట్లాడుతూ.. పాక్ తోక జాడిస్తే కట్ చెయ్యడమే కాదు, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. భారత్ దాడులకు తాళలేక కాళ్లబేరానైకి వచ్చింది పాకిస్తాన్, ప్రస్తుతం ఆపరేషన్ సిందూర్ ను నిలిపివేశామని, పాకిస్తాన్ తదుపరి చర్యలను బట్టి ఇండియా రియాక్షన్ ఉంటుందని మోదీ స్పష్టం చేసారు.