పాకిస్తాన్ ఉగ్రమూకలపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్ కాగా, ఈ ఆపరేషన్ గురించి బ్రీఫింగ్ ఇచ్చిన కల్నల్ సోఫియా ఖురేషి గురించి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చర్చ సాగింది. ఖురేషి తన అద్భుతమైన, సాహసోపేతమైన స్పీచ్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఖురేషి కుటుంబంలో ఆ క్షణం ఎంతో భావోద్వేగంతో నిండినది. ఆ సమయంలో తనను యూనిఫాంలో నిటారుగా నిలబడి ధీరవనితలా మాట్లాడుతూ ఉంటే, అది తనను ఎంతో భావోద్వేగానికి గురి చేసిందని తాజా ఇంటర్వ్యూలో ఖురేషి ట్విన్ సిస్టర్ అయిన డాక్టర్ సైనా సున్సారా తెలిపారు. తన సోదరి ధైర్యం, వక్తృత్వం తనను కళ్లార్పకుండా చూసేలా చేసాయని ఆమె తెలిపారు. జాతీయ మీడియాలో ఆమె బ్రీఫింగ్ ని వినడం అరుదైన దృశ్యం అని గుర్తు చేసుకున్నారు.
అదంతా సరే కానీ, ఖురేషి ట్విన్ సిస్టర్ సైనా సున్సారా అందచందాలు, ఆకర్షణ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న యువతలో చర్చగా మారింది. డాక్టర్ సైనా సున్సారా ఇప్పటికే శ్రీమతి. దేశ సేవలో, ప్రతిభలో తన సోదరి ఖురేషితో సమాన హోదాను కలిగి ఉన్నారు. ఆమె అందాల పోటీల రాణిగాను ఎంతో పాపులర్. శ్రీమతి గుజరాత్, శ్రీమతి ఇండియా ఎర్త్ 2017, శ్రీమతి యునైటెడ్ నేషన్స్ 2018 ట్రోఫీలను గెలుచుకున్నారు. వీటన్నిటినీ మించి గుజరాత్ లో లక్ష మొక్కల్ని నాటేందుకు ఉద్యమం చేపట్టిన పర్యావరణ వేత్త సైనా.
ముఖ్యంగా సైనా సున్సారీ అందాల రాణిగా యువత హృదయాలను గెలుచుకుంది. ఆమె మోడల్ గాను సుపరిచితురాలు. కానీ నటనా రంగానికి దూరంగా ఉండడం విస్మయపరిచింది. సినీరంగంలో ప్రవేశించి ఉంటే ఎంతో ఎత్తుకు ఎదిగేదని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. డాక్టర్ సైనా సున్సారా ఇన్ స్టాగ్రమ్ లో కొన్ని ఫోటోలు వీడియోలు మతి చెడగొడుతున్నాయి. కల్నల్ సోఫియా ఖురేషి అందమైన ట్విన్ సిస్టర్ ని ఎప్పటికీ యూత్ మర్చిపోలేరు.