ఫైనల్లీ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్ పూర్తి చేసేసారు. ఇక మేకర్స్ వీరమల్లు రిలీజ్ తేదీ ఇవ్వడం మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్స్ లో బిజీగా వున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ షూటింగ్ కి వెళుతున్నారు, ఇకపై OG కదులుతుంది అనుకున్నారు.
అదే నిజమైంది. OG కూడా కదిలింది. పవన్ కళ్యాణ్ త్వరలోనే OG సెట్ లోకి రాబోతున్నారు. అందుకే మేకర్స్ ఈరోజు నుంచి OG రెస్యూమ్ షూటింగ్ మొదలు పెట్టడమే కాదు ఈసారి ముగిద్దాం అంటూ బిగ్ అప్ డేట్ ఇచ్చారు. ఈ వారం సెట్స్‌లో పవన్ జాయిన్ అయ్యే అవకాశం ఉంది అని తెలిసి నిన్నమొన్నటివరకు సినిమా షూటింగ్స్ విషయంలో ఆచితూచి వ్యవహరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇలా స్పీడప్ అవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ లేకుండా OG కి సంబంధించి బ్యాంకాక్ షెడ్యూల్ ఒకటి జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాక కన్ ఫర్మ్ కావడంతోనే సోమవారం నుంచి షూటింగ్ తిరిగి ప్రారంభమైందని టీం సభ్యుడు వెల్లడించాడు. దానితో OG కి సంబంధించి విలన్ ఇమ్రాన్ హష్మీ-పవన్ కళ్యాణ్ నడుమ కీలక యుద్ధ సన్నివేశాలను సుజిత్ తెరకెక్కిస్తారని తెలుస్తుంది.
షూటింగ్ సజావుగా సాగితే.. మేకర్స్ OG విడుదల తేదీని కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.