టీవీ నటి గౌతమి కపూర్ ఇటీవలి షాకింగ్ స్టేట్మెంట్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. తన కూతురికి 16 ఏళ్లు నిండినప్పుడు సె* టాయ్ లేదా వైబ్రేటర్ బహుమతిగా ఇవ్వాలనుకున్నానని ఈ బోల్డ్ నటి వెల్లడించింది. అయితే ఘనమైన పుట్టినరోజు బహుమతిని ప్లాన్ చేసిన ఈ మమ్మీని ఇప్పుడు నెటిజనులు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. టీనేజీర్లకు సె* పాఠాలు నేర్పించాలి కానీ మరీ ఇంత టూమచ్‌గా నేర్పించకూడదని కామెంట్లు చేస్తున్నారు.
పదహారు ప్రాయంలో నా కూతురికి ఎలంటి బహుమతిగా ఇవ్వాలా? అని తీవ్రంగా చాలా ఆలోచించాను. నేను తనకు సెక్స్ టాయ్, వైబ్రేటర్ లేదా మరేదైనా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను! అని ఎంతో బోల్డ్ గా మాట్లాడిన గౌతమి ఆధునిక భావాలకు అందరూ షాక్ కి గురవుతున్నారు.
సె* టాయ్ గురించి కూతురితో చర్చించినప్పుడు..తను ``అమ్మా, నువ్వు దాన్ని పోగొట్టుకున్నావా?`` అని అడిగిందట. ఎంతమంది తల్లులు తమ కూతుళ్లకు అలాంటి బహుమతులు ఎందుకు ఇవ్వరు? అని అడుగుతున్నాను. ఎందుకు ప్రయోగం చేయకూడదు? అని గౌతమి అడిగారు. తన తల్లి తన కోసం చేయని కొన్ని పనులు ఉన్నాయని, కానీ తన కూతురి కోసం తాను చాలా చేయాలనుకుంటున్నానని వివరించింది. నా అమ్మ నాతో చేయనిది.. నేను నా కూతురితో చేయాలనుకుంటున్నాను. ఆమె ప్రతిదీ అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. చాలా మంది మహిళలు జీవితంలోని ఆనందాలను అనుభవించకుండానే గడుపుతారు. ఆ పరిస్థితిలో ఎందుకు ఉండాలి? ఈ రోజు నా కూతురికి 19 సంవత్సరాలు. నాకు ఆ ఆలోచన ఉందని ఆమె అభినందిస్తుంది..నన్ను గౌరవిస్తుంది! అని బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చింది.