దర్శకుడిగా బిగ్ బ్రేక్ తీసుకున్న వైవిఎస్ చౌదరి నందమూరి నాలుగోతరం వారసుడిని హీరో గా ఇంట్రడ్యూస్ చేస్తున్న సినిమా కోసం మీడియా వారికి తానే ప్రత్యేకంగా పేరు పేరునా ఫోన్ చేసి మరీ పూజా కార్యక్రమానికి ఆహ్వానించడం హాట్ టాపిక్ అయ్యింది. మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ఘాట్ ని దేవాలయంగా భావించి నందమూరి వారసుడి సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలు జరిపించడం నందమూరి అభిమానులకు ముచ్చటగా మారింది. ఈ కార్యక్రానికి వచ్చిన వారంతా ఇది వైవిఎస్ చౌదరికి మాత్రమే సాధ్యమైంది అంటూ చర్చించుకోవడం విశేషం.
అన్నగారు ఎన్టీఆర్ అభిమాని అయిన దర్శకుడు వైవిఎస్ చౌదరి నందమూరి నాలుగోతరాన్ని వెండితెరకు పరిచయం చెయ్యబోతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ మనవడు కీర్తి శేషులు జానకిరామ్ పెద్ద కొడుకు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్ ) హీరోగా వైవిఎస్ చేతుల మీదుగా డెబ్యూ మూవీ కి ఈ రోజు సోమవారం ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా నందమూరి కుటుంబంతో కలిసి శ్రీకారం చుట్టారు.
ఏపీ సీఎం చంద్రబాబు గారి సతీమణి నారా భువనేశ్వరి మేనల్లుడు జానకి రామ్ కొడుకు ఎన్టీఆర్ చిత్రానికి క్లాప్ కొట్టగా, ఎన్టీఆర్ గారి కొడుకులు రామకృష్ణ, మోహన కృష్ణ, కళ్యాణ్ చక్రవర్తి, కుమార్తెలు భువనేశ్వరి, పురందరేశ్వరి, హరికృష్ణ కుమార్తె సుహాసిని, బాలకృష్ణ వైఫ్ వసుందర, హరికిష్ణ గారి భార్య ఇలా నందమూరి ఫ్యామిలీ మెంబెర్స్ అంతా జానకిరామ్ కొడుకుని ఆశీర్వదించడానికి వచ్చిన వారిలో ఉన్నారు.