మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్-గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఆర్.ఆర్.ఆర్ లో వేసిన నాటు నాటు స్టెప్స్ ఇప్పటికి పలు సందర్భాల్లో ట్రెండింగ్ లో ఉంటుంది. ఆ నాటు నాటు స్టెప్స్ కి హాలీవుడ్ నటుల దగ్గరనుంచి హిందీ హీరోల వరకు ముగ్దులయ్యారు. తాజాగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి లండన్ లో ఒకే వేదికపై కనిపించి సందడి చేసారు.
ఆ వేదికపై ఎన్టీఆర్-రామ్ చరణ్ బాండింగ్ చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. ఇదే వేదికపై ఎన్టీఆర్ కు ముందే అడ్వాన్స్ గా బర్త్ డే విషెస్ చెప్పారు రామ్ చరణ్. ఈ వేదికపై మట్లాడుతూ ఎన్టీఆర్ తన డ్రీమ్ ని రివీల్ చేసారు. నాటు నాటు సాంగ్ లో నా బెస్ట్ ఫ్రెండ్ చరణ్ తో కలిసి కాలు కదపడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్పటికి మరిచిపోలేను.
అయితే చరణ్ వాళ్ల నాన్న చిరంజీవి గారు ఎంత గొప్ప డ్యాన్సరో మనందరికి తెలుసు. అలాగే మా బాబాయ్ బాలయ్య కూడా మంచి డ్యాన్సర్. వీరిద్దరు కలిసి నాటు నాటుకి డ్యాన్స్ చేస్తే అది చరిత్రలో ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది అంటూ ఎన్టీఆర్ తన విష్ ని తెలియజేసారు. మరి తారక్ డ్రీమ్ నిజమైతే ఫ్యాన్ కు పూనకాలే. వారు కలిసి సినిమాలోనే డాన్స్ చెయ్యనక్కర్లేదు, స్టేజ్ పై కాలు కదిపినా చాలు అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.
ఇంకా ఈ వేదికపై రామ్ చరణ్ తారక్ ను హగ్ చేసుకుని ముద్దు పెట్టిన వీడియోని అభిమానులు అపురూపంగా షేర్ చేసుకుంటున్నారు.