ఈమధ్యన హీరో విశాల్ తరచూ అనారోగ్యం బారిన పడడం ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. కొన్ని నెలల క్రితం అంటే మద గజ రాజా సినిమా ప్రమోషన్స్‌లో విశాల్ చాలా నీరసంగా కనిపించడమే కాదు ఆయన చేతులు వణుకుతూ కనిపించడంతో అప్పుడు ఫ్యాన్స్ కలవబడ్డారు. కానీ విశాల్ ఆ సమయంలో ఫీవర్ తో బాధపడుతున్నారని అన్నారు.
కానీ ఇప్పుడు ఓ వేదికపై విశాల్ కళ్ళు తిరిగి పడిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. తమిళనాడులోని విల్లుపురంలో ఆదివారం నిర్వహించిన ట్రాన్స్‌జెండర్ అందాల పోటీలకు విశాల్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. స్టేజ్ మీదకు వచ్చిన విశాల్ ఉన్నట్టుండి సొమ్మసిల్లి పడిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆయనకు ఏమైందో అని అభిమానులు కలవరపడ్డారు.
విశాల్ స్పృహతప్పి పడిపోయిన వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్టుగా తెలుస్తుంది. అయితే విశాల్ అలా పడిపోవడానికి కారణం ఆహారం తీసుకోకపోవడం వల్లనే అని తెలుస్తుంది. అరగంట విశ్రాంతి తర్వాత విశాల్ తిరిగి ఆ కార్యక్రమానికి హాజరయ్యారని చెబుతున్నారు. ప్రస్తుతమయితే విశాల్ కి ఎలాంటి ప్రమాదం లేదు అని తెలియడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.