పద్మభూషణ్ నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ షూటింగ్ తో పాటుగా హిందూపూర్ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజల్లోకి వెళ్లొచ్చారు. అటు రాజకీయంగా, ఇటు ప్రొఫెషనల్ గా క్షణం తీరిక లేని బాలయ్య వరస విజయాలతో తన క్రేజ్ పెంచుకున్నారు. ప్రస్తుతం అఖండ 2 తాండవం షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.
ఈలోపు కోలీవుడ్ క్రేజీ సీక్వెల్ జైలర్ 2 లో బాలకృష్ణ గెస్ట్ రోల్ కనిపించబోతున్నారనే వార్త వైరల్ అవడము, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దానిని కన్ ఫర్మ్ చెయ్యడము జరిగిపోయాయి. అయితే బాలయ్య సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ లో ఎలాంటి రోల్ పోషిస్తారు, ఏ లుక్ లో కనిపిస్తారనే విషయంలోనూ ఆల్మోస్ట్ ఓ క్లారిటీ వచ్చినట్టే కనబడుతుంది.
కన్నడ హీరో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ లు డాన్ లుగా గెస్ట్ రోల్స్ పోషిస్తుండగా, మన సింహం బాలయ్య పోలీస్ ఆఫీస్ గా జైలర్ 2 లో పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. అది కూడా ఏపీ పోలీస్ ఆఫీసర్ గా బాలకృష్ణ కనిస్తారని టాక్. బాలయ్య పాత్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
జైలర్ చిత్రంలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ పాత్రలు చూసాక అందరూ బాలయ్య కూడా ఈ ప్రాజెక్టులో భాగమైతే బావుండు అనుకున్నారు. ఇప్పుడు దాని సీక్వెల్ లో బాలయ్య భాగమై జైలర్ 2 పై అంచనాలు పెంచేశారు.