సమంత మాయోసైటిస్ తో బాధపడుతూ.. సౌత్ సినిమాలను పక్కనపెట్టింది. విజయ్ దేవరకొండ తో చేసిన ఖుషి నే సమంత లాస్ట్ సౌత్ మూవీ. ఆ తర్వాత ఆమె హిందీ వెబ్ సీరీస్ లలో నటిస్తుండడంతో.. సమంత కావాలనే సౌత్ సినిమాను పక్కన పెట్టిందా అనే అనుమానాలు నడిచాయి.
ఒకొనొక సమయంలో సౌత్ ప్రేక్షకులు సమంత ను మర్చిపోతారేమో అని కూడా మాట్లాడుకున్నారు. అయితే సమంత రామ్ చరణ్ సినిమా, అల్లు అర్జున్-అట్లీ సినిమా ఆఫర్స్ వచ్చినా ఒప్పుకోలేదని అన్నారు. కానీ సమంత తనకు AA 22లో ఎలాంటి అఫర్ రాలేదు అని స్పష్టం చెయ్యడమే కాదు తను సౌత్ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది కేవలం అనారోగ్య కారణాల చేతే అని క్లారిటీ ఇచ్చింది.
అయితే సౌత్ సినిమాలో పవర్ ఫుల్ పాత్రతో సమంత కమ్ బ్యాక్ అవుతుంది అనుకుంటే ఆమె నిర్మించిన శుభం చిత్రంలో జస్ట్ చిన్న రోల్ లో మెరిసింది. మోడ్రెన్ మాయ గా కనిపించిన సమంత ఆ పాత్రలో కేవలం రెండు మూడు సీన్స్ కి పరిమితం కావడం.. మాయ గెటప్, అలాగే ఆమె సీన్స్ అంతగా ఇంప్రెస్ చెయ్యకపోవడంతో సమంత ఫ్యాన్స్ చాలా డిజప్పాయయింట్ అవుతున్నారు.
మరి సమంత ఓ మంచి పాత్రతో సౌత్ ఆడియన్స్ ముందుకు ఎప్పుడు వస్తుందో చూడాలి.