పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి తో కలిసి రొమాంటిక్ గా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మ కి ఇప్పటివరకు ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ఆకాష్ పూరి తో చేసిన రొమాంటిక్ డిజాస్టర్ రిజల్ట్ ఇవ్వగా, ఆ తర్వాత మెగా హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న కేతిక కు వారు కూడా షాకిచ్చారు. సాయి ధరమ్ తెజ్ బ్రో, వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా చిత్రాలు మాత్రమే కాదు నాగశౌర్య తో చేసిన లక్ష్యం కూడా పాపకు హిట్ ఇవ్వలేదు.
ఇక కేతిక కెరీర్ ఢమాల్ అనుకున్న సమయంలో రాబిన్ హుడ్ లో నితిన్ తో కలిసి స్పెషల్ స్టెప్స్ వేసే ఆఫర్ వచ్చింది. ఆ సాంగ్ లో కేతిక వేసిన స్టెప్స్ పై కాంట్రవర్సీ నడిచింది. దానిపై కేతిక శర్మ ఆమె నటించిన సింగిల్ ఇంటర్వ్యూలో వివరణ కూడా ఇచ్చుకుంది. అయితే ఎట్టకేలకు కేతిక శర్మకు టాలీవుడ్ లో ఓ హిట్ పడింది.
కేతిక శర్మ నటించిన సింగిల్ ఈ శుక్రవారం విడుదలైంది. శ్రీ విష్ణు హీరోగా, మరో హీరోయిన్ ఇవానా తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న కేతిక శర్మకు సింగిల్ రిజల్ట్ కాస్త ఊరటనిచ్చింది. సింగిల్ చిత్రానికి ఆడియన్స్ నుంచే కాదు, క్రిటిక్స్ నుంచి కూడా యునానమస్ గా పాజిటివ్ టాక్ రావడంతో సింగిల్ హిట్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది.
మారి ఆ లెక్కన సింగిల్ హిట్ కేతిక శర్మ ఖాతాలోకి వెళుతుంది. సో అలా కేతిక సింగిల్ తో మొట్టమొదటి విజయాన్ని రుచి చూసింది. ఇకపై అమ్మడు కెరీర్ ఎలా ఉండబోతుందో చూద్దాం.