Advertisement
Google Ads BL

మైన‌పు విగ్ర‌హంతో చెర్రీ ఫోజ్


లండన్‌ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గ్లోబ‌ల్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ మైన‌పు విగ్ర‌హాన్ని ఇటీవ‌ల ఆవిష్క‌రించారు. ఎట్ట‌కేల‌కు ఈ విగ్ర‌హంతో పాటు రియ‌ల్ రామ్‌ చ‌ర‌ణ్ ఫోటో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది. మేడమ్ టుస్సాడ్స్‌కు వెళుతున్న క్ర‌మంలో లండన్ వీధుల్లో మెగాభిమానుల సంద‌డి పీక్స్ కి చేరుకుంది. అభిమానులు షేక్ హ్యాండ్స్ ఇస్తూ రామ్ చరణ్‌కు ఘన స్వాగతం పలికిన వీడియోలు వైర‌ల్ అయ్యాయి. ఎట్ట‌కేల‌కు విగ్ర‌హావిష్క‌ర‌ణ పూర్త‌యింది. కొద్ది రోజుల తర్వాత రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని శాశ్వతంగా మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్‌కు తరలిస్తారు.

Advertisement
CJ Advs

 

ఆస‌క్తిక‌రంగా పెంపుడు కుక్క‌తో మైన‌పు విగ్ర‌హాన్ని సుసాధ్యం చేసుకున్న‌ ఏకైక స్టార్ గా రామ్ చ‌ర‌ణ్ రికార్డుల‌కెక్కాడు. ప్ర‌పంచంలోనే ఇలాంటి అవ‌కాశం వేరొక న‌టుడిని వ‌రించ‌లేదు. ప్ర‌భాస్, మ‌హేష్, అల్లు అర్జున్ లాంటి స్టార్ల‌కు కూడా గ‌తంలో మేడ‌మ్ టుస్సాడ్స్ లో మైన‌పు విగ్ర‌హాల‌ను ఆవిష్క‌రించారు. ఇప్పుడు అదే చోట రైమ్ తో పాటు రామ్ చ‌ర‌ణ్ మైన‌పు విగ్ర‌హం కొలువు దీర‌నుంది. చ‌ర‌ణ్‌- రైమ్ మైన‌పు విగ్ర‌హంతో చ‌ర‌ణ్ ఫోజ్ ఇప్పుడు మెగాభిమానుల్లో వైర‌ల్ గా మారుతోంది. లండన్ నుండి తిరిగి వచ్చిన వెంటనే రామ్ చరణ్ పెద్ది షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తాడు.  బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్న‌ ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.  ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Ram Charan Wax Statue Unveiled at Madame Tussauds Museum:

&nbsp; <p class="MsoNormal"><span>Ram Charan wax statue was launched at Madame Tussauds Museum in London</span> &nbsp;
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs