Advertisement
Google Ads BL

త‌న‌యుడికి మ‌ళ్లీ పూరి ఛాన్స్


ఆకాష్ పూరి అవ‌కాశం కోసం ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. హీరోగా స‌మ‌ర్దుడే అయినా అవ‌కాశాలు అందుకోవ‌డంలో మాత్రం  వెనుక‌బ‌డే ఉన్నాడు. చివ‌రిగా రిలీజ్ అయిన `చోర్ బ‌జార్` తోనూ ఆశించిన ఫ‌లితాన్ని సాధించ‌లేక‌పోయాడు. దీంతో కొత్త అవ‌కాశాలు మ‌రింత క‌ఠినంగా మారాయి. వెనుక పూరి అనే బ్రాండ్ ఇమేజ్ ఉన్నా? ఆ ఇమేజ్ ను వాడుకోకుండా అవ‌కాశాలు ద‌క్కించుకోవాలి అన్న‌ది ఆకాష్ నియ మం.

Advertisement
CJ Advs

 

డాడ్ పెట్టిన రూల్ ని బ్రేక్ చేయ‌డానికి లేదు. ఆ కార‌ణంగానూ ఆకాష్ రేసులో  వెనుక‌బ‌డుతున్నాడు.  డాడ్ త‌ర‌హాలో క‌ష్టే ఫ‌లి అనే మాట‌ని న‌మ్మి ముందుకెళ్తున్నాడు. కెరీర్ ట‌ర్నింగ్ ఛాన్స్ రాక‌పోతుందా? అని ఎదురు చూస్తున్నాడు. అయితే ఇప్పుడా ఛాన్స్ డాడ్ రూపంలో వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాధ్ - మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తితో ఓ సినిమాకు రంగం సిద్దం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

 

ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. తెలుగు, త‌మిళ్ లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. పూరి సొంత బ్యాన‌ర్లోనే ఛార్మీ స‌హ‌కారంతో  స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. ఇందులో ఓ కీల‌క పాత్ర‌కు ఆకాష్ ని  తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఆ రోల్ హీరో పాత్ర‌కు ధీటుగా ఉంటుందంటున్నారు. పాత్ర‌లో కాస్త నెగిటివిటీ కోణం కూడా హైలైట్ అవుతుందిట‌.

 

ఈ సినిమా త‌ర్వాత ఆకాష్ ఐడెంటిటీనే మారిప‌తుందంటున్నారు. మ‌రి ఈ ప్ర‌చార‌మంతా నిజ‌మా?  కాదా? అన్న‌ది మేక‌ర్స్ ధృవీక‌రించాలి. పూరి ద‌ర్శ‌క‌ త్వంలో ఆకాష్ ఇప్ప‌టికే  `మెహబూబా`చిత్రాన్ని చేసిన సంగ‌తి తెలిసిందే. ఇండియా -పాకిస్తాన్ జంట ప్రేమికుల క‌థ‌గా దీన్ని తీర్చిదిద్దాడు. సినిమా మంచి హైప్ తో రిలీజ్ అయిన ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. 

Akash Puri In Puri Jagannadh next:

&nbsp; <p class="MsoNormal">Akash Puri In Puri Jagannadh Vijay Sethupathi film &nbsp;
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs