Advertisement
Google Ads BL

దేవ‌ర‌కొండ ఆస్తుల రేంజ్


కేవ‌లం ఐదారేళ్ల‌లో కోట్ల‌లో పారితోషికం అందుకునే హీరోగా ఎదిగాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అత‌డి కెరీర్ ఆరంభం, ఎదుగుద‌ల ఎప్పుడూ నేటి ఔత్సాహిక న‌టీన‌టుల‌కు ఎంతో స్ఫూర్తి అన‌డంలో సందేహం లేదు. 2016లో పెళ్లి చూపులు సినిమాతో క‌థానాయ‌కుడిగా కెరీర్ ని ప్రారంభించిన దేవ‌ర‌కొండ అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించాడు. మార్కెట్లో నమ్మ‌ద‌గిన క‌థానాయ‌కుడిగా త‌న బ్రాండ్ ని సుస్థిరం చేసుకున్నాడు విజ‌య్. కొన్ని ఫ్లాపులు ఎదురైనా కానీ, తన ప్రభావవంతమైన నటనతో హృద‌యాల‌ను గెలుచుకున్నాడు. ముఖ్యంగా విజ‌య్ టాలీవుడ్ ర‌ణ్ వీర్ లా ఫ్యాష‌న్ అండ్ స్టైల్స్ ని అనుక‌రించ‌డంలో ప్ర‌సిద్ధి చెందాడు.

Advertisement
CJ Advs

 

36 వ‌య‌సుకే దేవ‌ర‌కొండ నిక‌ర ఆస్తి విలువ నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. 2025 లెక్క‌ల ప్ర‌కారం.. విజయ్ దేవరకొండ నికర ఆస్తి విలువ రూ. 50 నుండి రూ. 70 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. అతడు ఒక్కో చిత్రానికి రూ. 15 కోట్లకు పైగా వసూలు చేస్తూ తెలుగు పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే యువ‌ నటులలో ఒకరిగా నిలిచాడు. నటనతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ల కోసం కోటి రూపాయలకు పైగా ఆర్జిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్పాన్సర్ చేసిన ఒకే పోస్ట్‌కు దాదాపు రూ. 40 లక్షలు అందుకుంటున్నాడ‌ని టాక్ ఉంది. విజయ్ తెలివైన పెట్టుబ‌డుల‌తో ఎంట‌ర్ ప్రెన్యూర్ గాను ఎదుగుతున్నాడు. ఏషియ‌న్ సినిమాస్ తో క‌లిసి అత‌డు థియేట‌ర్ల వ్యాపారంలో కూడా అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే.

 

జూబ్లీ హిల్స్‌లోని విజ‌య్ విలాసవంతమైన ఇల్లు ఖ‌రీదు సుమారు 15కోట్లు. ఈ ఇంట్లో అత‌డి కుటుంబం నివ‌శిస్తోంది. విజయ్ దేవరకొండ కార్ గ్యారేజీ హై ఎండ్ కార్ల‌తో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. BMW 5 సిరీస్ 520d లగ్జరీ లైన్ మెర్సిడెస్-బెంజ్ GLS 350, వోల్వో XC90, లెక్సస్ MPV, ఆడి Q7 వంటి ఖ‌రీదైన కార్లు అత‌డి సొంతం.

 

విజయ్ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అత‌డు న‌టిస్తున్న `కింగ్‌డమ్` పాన్ ఇండియాలో విడుదలకు సిద్ధమవుతోంది. దీనిని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. భాగ్యశ్రీ బోర్సే క‌థానాయిక‌గా న‌టించింది. ఈ చిత్రం మే 30న అత్యంత భారీగా విడుద‌ల కానుంది. బ్రిటిష్ వలస పాలన నేపథ్యంలో దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తో మరో భారీ ప్రాజెక్ట్‌లో న‌టించేందుకు అత‌డు సిద్ధ‌మ‌వుతున్నాడు. నేడు తెలుగు, త‌మిళం, హిందీలో మార్కెట్ ఉన్న హీరోగా విజయ్ దేవ‌ర‌కొండ త‌న‌ను తాను మ‌లుచుకున్న వైనం ఎంద‌రికో స్ఫూర్తి అన‌డంలో సందేహం లేదు. హైద‌రాబాదీ యువ‌కుడిగా దేవ‌ర‌కొండ తెలంగాణ స‌హా తెలుగు రాష్ట్రాల్లోని యూత్ కి ఒక ప్రేర‌ణ‌గా నిలుస్తున్నాడు.

vijay devarakonda property value:

vijay devarakonda and his properties
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs