పవన్ కోసం విజయ్ దేవరకొండ, విజయ్ దేవరకొండ కోసం పవన్ త్యాగం చేసారా, అందుకే మే 30ని ఇద్దరూ వదిలేసుకున్నారా, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ మే 30 నుంచి తప్పుకొవడంతోనే బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ల భైరవం మే 30 న విడుదల అని అనౌన్స్ చేసారా.. అనేది ఇప్పుడు అందరిలో నడుస్తున్న అనుమానం.
పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మే 30 న వస్తుంది అని విజయ్ దేవరకొండ కింగ్ డమ్ విడుదలను వాయిదా వేసుకునేలా మేకర్స్ ఆలోచిస్తున్నారని, హరి హార్ వీరమల్లు జూన్ రెండో వారంలో రావొచ్చనే ఉహాగానాలు ఉన్నప్పటికీ విజయ్ దేవరకొండకి రిస్క్ చేసే ఉద్దేశ్యం లేకనే మే 30 ని వదిలేసాడని అంటున్నారు.
మే 30 న పవన్ కళ్యాణ్ వీరమల్లు, విజయ్ దేవరకొండ కింగ్ డమ్ తప్పుకుంటున్నాయి కాబట్టే ధైర్యంగా భైరవం కచ్చిఫ్ వేసింది అంటున్నారు. కానీ విజయ్ కోసం పవన్, పవన్ కోసం విజయ్ ఇద్దరూ మే 30 లాంటి మంచి డేట్ ఒకరి కోసం ఒకరు వదులుకోవడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూద్దాం అవెప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తాయో అనేది.