Advertisement
Google Ads BL

కొత్త గర్ల్ ఫ్రెండ్ తో మరోసారి జయం రవి


కోలీవుడ్ యాక్టర్ జయం రవి తన భార్య ఆర్తికి విడాకులు ఇవ్వడానికి సిద్దపడ్డమే కాదు, జయం రవి-ఆర్తి విడాకులను చెన్నై ఫ్యామిలీ కోర్టు  ఇష్యు చేసింది. అయితే జయం రవి ఇన్నేళ్ల తర్వాత భార్య కు విడాకులు ఇవ్వడానికి అసలు కారణం ఓ సింగర్, ఆమెతో జయం రవి డేటింగ్ లో ఉన్నారనే వార్త చక్కర్లు కొట్టింది. 

Advertisement
CJ Advs

అటు జయం రవి తో విడిపోవడానికి ఆర్తి సిద్ధపడలేదు, కానీ జయం రవి మాత్రం విడాకులకు మొగ్గు చూపారు, కోర్టు కూడా వీరికి మరో అవకాశం ఇచ్చినా వారు మాత్రం విడాకులే కోరుకున్నారు. అయితే కొద్దిరోజుల ముందు జయం రవి సింగర్ కెనిషా తో కలిసి కనిపించేవారు. 

కానీ కొద్దిరోజులుగా వారు ఎక్కడా కలిసి కనిపించలేదు. తాజాగా చెన్నైలో జరిగిన ఓ వివాహానికి కెనిష తో కలిసి జయం రవి రావడం మరోసారి అనుమానాలకు తావిచ్చింది. 

గతంలో ఆమెతో ఎలాంటి రిలేషన్ లేదు, ఆమె ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి, ఇప్పుడు విడాకులయిన కొద్ధి నెలలకే ఇలా కలిసి పబ్లిక్ ఈవెంట్ లో కనిపించడం అనేది ఎలా అర్ధం చేసుకోవాలో రవి గారే చెప్పాలేమో అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. 

Jayam Ravi once again with a new girlfriend:

Ravi Mohan attends a wedding with rumoured girlfriend Kenishaa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs