యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న NTR31డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) కర్ణాటక షెడ్యూల్ ముగించుకుని రెండు రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చారు. ఏప్రిల్ 22న నీల్ ప్రాజెక్ట్ లోకి జాయిన్ అయిన ఎన్టీఆర్ బెంగుళూరుకి అతి సమీపంలో వేసిన సెట్ లో డ్రాగన్ మూవీ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఆ షెడ్యూల్ ముగియడంతో ఆయన బెంగుళూరు నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చారు.
ఇక ఎన్టీఆర్ కి కాస్త బ్రేక్ దొరడంతో ఫ్యామిలీ అంటే భార్య ప్రణతి, పిల్లలు భార్గవ్ రామ్, అభయ్ రామ్ లతో కలిసి బర్త్ డే ట్రిప్ ప్లాన్ చేసినట్టుగా ఉన్నారు. అందుకే ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. కొడుకులు, భార్య తో కలిసి ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ లో ఉన్న వీడియో వైరల్ గా మారింది.
మరి ఎన్టీఆర్ మే 20 న చేసుకోబోయే బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం ఏ దేశానికి వెళుతున్నారో అనే ఆతృతలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కనిపిస్తున్నారు. ఇక ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ నుంచి, దేవర 2 నుంచి అభిమానుల కోసం ఎన్టీఆర్ బర్త్ డే ట్రీట్స్ సిద్ధం చేస్తున్నారు మేకర్స్.