హీరో శ్రీవిష్ణు కి కెరీర్ లో కామెడీ జోనర్ కలిసొచ్చినట్టుగా యాక్షన్ జానర్ కానీ, అలాగే సీరియస్ జానర్ కానీ కలిసిరాలేదనే చెప్పాలి. ఆయన మాటలోని యాస ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. వెటకారంగా చూపించే బాడీ లాంగ్వేజ్ అన్ని శ్రీవిష్ణు సొంతం. సామజవరాగమన తర్వాత శ్రీవిష్ణు ట్రై చేసిన సినిమాలు హిట్ అవ్వలేదు, ప్రేక్షకులకు నచ్చలేదు.
డిఫరెంట్ గా చేసిన స్వాగ్ శ్రీవిష్ణు కి షాకిచ్చింది. తాజాగా శ్రీవిష్ణు సింగిల్ అంటూ కామెడీగా జానర్ కథలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇవానా, కేతిక శర్మ హీరోయిన్స్ గా శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన సింగిల్ మే 9 శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి, అటు సినీ విశ్లేషకుల నుంచి యునానమస్ గా పాజిటివ్ టాక్ స్టార్ట్ అయ్యింది.
సింగిల్ చిత్రంలో శ్రీవిష్ణు-వెన్నెల కిషోర్ కలయికలో వచ్చే కామెడీ సీన్స్ కి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతున్నారు, దర్శకుడు రెండు గంటల్లో ఎక్కడా బోర్ కొట్టకుండా కామెడీని కూరుస్తూ స్పీడ్ రన్ చేశాడు. సింగిల్ సినిమా చూస్తూ ఫ్యామిలీతో వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు.. అంటూ ఆడియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. సో సామజవరాగమన తర్వాత శ్రీవిష్ణు కి సింగిల్ పెద్ద హిట్ అన్నమాట.