ఇండియా-పాకిస్తాన్ మద్యన యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. అది ఏ క్షణాన అయినా భీకర తుఫాన్ గా మారె అవకాశం ఉంది, పాకిస్తాన్ ఇండియాపై కవ్వింపు చర్యలకు పాల్పడడమే కాదు జమ్మూ కాశ్మీర్ పహాల్గమ్ లో అమాయకులైన ప్రజల ప్రాణాలు బలి తీసింది. ప్రతి చర్యగా ఇండియా పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడులు చేసి వారిని మట్టుపెట్టింది. ఉగ్రవాదులను పెంచి పోషించే పాకిస్తాన్ ఇండియాపైకి క్షిపణులను పంపుతుంది.
ప్రస్తుతం ఇండియా-పాక్ నడుమ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా జమ్ము కశ్మీర్ సరిహద్దుల్లో దేశ రక్షణ విధుల్లో నిన్న తెలుగు జవాన్ మురళి నాయక్ వీర మరణం పొందారు. పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో మురళి నాయక్ మృతి చెందినట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి.
ఈ వార్తతో ఆయన స్వగ్రామంలోనే కాకుండా ఏపీవ్యాప్తంగా విషాధ ఛాయలు అలుముకున్నాయి. మురళి నాయక్ వీర మరణానికి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంతాపం తెలియజెసారు, అంతేకాదు మురళి నాయక్ అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లుగా తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లు మురళి నాయక్ వీరమరణానికి సంతాపం తెలియజేసారు.