టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అనారోగ్యకారణాలతో సతమతమవుతూ సౌత్ సినిమాలకు బ్రేకిచ్చింది. నటనకు మాత్రమే బ్రేకిచ్చిన సమంత ఇప్పుడు కొత్త పాత్రలోకి ఎంటర్ అయ్యింది. నిర్మాతగా మారింది. సమంత నిర్మాతగా శుభం చిత్రం తెరకెక్కింది. ఈరోజు మే 9 న విడుదలైన శుభం చిత్రం ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
కొత్త నటులతో తాను నిర్మించిన శుభం చిత్రాన్ని సమంత బాగా ప్రమోట్ చేసింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వూస్ ఇలా శుభం చిత్రాన్ని ఆడియన్స్ లోకి తీసుకెళ్లింది. ఇక నిన్నటి నుంచే శుభం ప్రీమియర్స్ తో సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.
క్రిటిక్స్ కూడా శుభం చిత్రానికి అబో యావరేజ్ రివ్యూస్ ఇవ్వడం, ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో నిర్మాతగా సమంత మొదటి చిత్రం శుభం తోనే హిట్ కొట్టింది. అటు నటిగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సమంత ఇటు నిర్మాతగా నిరూపించుకుంది. ప్రస్తుతం థియేటర్స్ లో విడుదలైన శుభం చిత్రాన్ని ఆడియన్స్ ఎంజోయ్ చేస్తున్నారు.