బాలీవుడ్ స్టార్ హీరోల బర్త్ డే లకు వారు నటించే చిత్రాల నుంచి ఎలాంటి అప్ డేట్స్ కానీ, పోస్టర్స్ కానీ, అభిమానుల కోసం ట్రీట్స్ కానీ ఉండవు. అది బాలీవుడ్ సెంటిమెంటా, లేదంటే మారేదన్నానా అనేది మాత్రం తెలియదు కానీ.. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ బర్త్ డే కి వార్ 2 నుంచి సర్ ప్రైజ్ బర్త్ డే ట్రీట్ కోరుకుంటున్నారు.
వార్ 2 నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ తమ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి అభిమానుల కోసం వార్ 2 నుంచి ఏమైనా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ న వదులుతారా అనే ఆశ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కనిపిస్తున్నారు. మరో పక్క వార్ 2నుంచి ఎన్టీఆర్ బర్త్ డే కి టీజర్ వదిలే అవకాశం ఉంది అనే వార్త వారిని ఎగ్జైట్ చేస్తుంది.
మరి నిజంగానే బాలీవుడ్ సెంటిమెంట్ వార్ 2 తో బ్రేక్ అవుతుందా అనేది మాత్రం ప్రస్తుతానికి ఉన్న క్యూరియాసిటీ, అలాగే సస్పెన్స్ కూడా. చూద్దాం ఎన్టీఆర్ బర్త్ డే కి వార్ 2 నుంచి ఎలాంటి అప్ డేట్ వస్తుందో, రాదో అనేది.