మెగా చిన్న కోడలిగా నాగబాబు ఇంట అడుగుపెట్టిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ని వివాహమాడాక నటనను కంటిన్యూ చేస్తాను అని చెప్పింది. పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి సతి లీలావతి సినిమా మొదలు పెట్టింది. ఇప్పుడు లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్. ఆ విషయాన్ని రీసెంట్ గానే వెల్లడించారు వరుణ్ తేజ్ దంపతులు.
మెగా ఫ్యామిలీ లోకి మరో వారసుడు రాబోతున్నాడు. లావణ్య ప్రెగ్నెంట్ కావడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. నాగబాబు అయన భార్య పద్మజ కోడలు లావణ్యని కాలు కిందపెట్టకుండా చూసుకుంటున్నారు. నిహారిక అయితే అత్త అవుతున్నందుకు ఆనందంగా ఉంది.
అయితే ఇప్పడు లావణ్య నటనను కోనసాగిస్తుందా, బాలీవుడ్ హీరోయిన్స్ మాదిరి లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ గా ఉండి షూటింగ్ కి వెళుతుందా, లేదంటే నటనకు బ్రేకిచ్చి ప్రెగ్నెన్సీ ని ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. మరి తెలుగు లో ప్రెగ్నెంట్ హీరోయిన్స్ ఇప్పటివరకు నటించిన సందర్భం లేదు, బాలీవుడ్ లో అంటే కరీనా, దీపికా, కియారా, అలియా భట్ లాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసాక కూడా వారు సినిమా సెట్ లో కనిపించేవారు.
ఇప్పుడు మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.