ఈమధ్యన ఏపీ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో రెడ్ బుక్, పింక్ బుక్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. రాజకీయనేతలు అధికారంలో లేకపోతే తమని ఇబ్బందిపెట్టిన అధికారుల పేర్లను ఓ బుక్ లో రాసుకుని అధికారం రాగానే తిరిగి ఇచ్చే ప్లాన్ లో భాగమే ఈ రెడ్ బుక్, పింక్ బుక్. ఏపీలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఈ రెడ్ బుక్ కి శ్రీకారం చుట్టాడు, ఇక్కడ తెలంగాణాలో కల్వకుంట్ల కవిత లాంటి వాళ్ళు దానిని ఫాలో అవుతూ పింక్ బుక్ రాస్తున్నారు.
ఇప్పుడు జగన్ కూడా రాసుకోమంటున్నాడు. తమను ఇబ్బంది పెట్టిన ఏ అధికారి పేర్లైనా రాయండి, వారు ఉద్యోగంలో లేకపోయినా, రిటైర్ అయినా తాము అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టమంటూ హెచ్చరికలు జారి చేస్తున్నారు. వైసీపీ పార్టీ అధికారం పోయి 11సీట్ల కె పరిమితం అయ్యాక ఏం చెయ్యాలో తెలియక జగన్ అప్పుడప్పుడు బెంగుళూరు నుంచి వచ్చి హడావిడి చేసి మళ్లీ బెంగుళూరుకు చెక్కేస్తున్నాడు.
ఇక ఇపుడు కూటమి ప్రభుత్వం తప్పిదాలే తమకు మళ్లీ అధికారం కట్టబెడుతుంది అనే కాన్ఫిడెంట్ జగన్ లో పెరిగిందట, ఆ ఆత్మవిశ్వాసమే జగన్ తో ఇలా తమను ఇబ్బందిపెట్టే అధికారులను వదలను అని హెచ్చరించేలా మాట్లాడిస్తుంది అంటూ బ్లూ మీడియా జగన్ ఆత్మవిశ్వాసం గురించి డంఖా బజాయిస్తుంది. మరి జగన్ కూడా పేర్లు రాసుకోండి, కార్యకర్తలను వేధించే అధికారులను వదలకుండా శిక్షిద్దామంటూ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నాడనే మాట బ్లూ మీడియా ప్రచారం చేస్తోంది. చూద్దాం వీరి బుక్ కి ఏం పేరు పెడతారో.