సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా డిస్కర్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ హీరోలకన్నా కూసింత ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ కొన్నేళ్లుగా డిజాస్టర్స్ చవిచూసినా, జైలర్ చిత్రంతో బ్యాక్ టు ఫామ్ అంటూ ఆయన క్రేజ్ మళ్లీ పెరిగింది.
ఆతర్వాత వెట్టయ్యన్ అటు ఇటుగా అయినా.. ప్రస్తుతం సూపర్ స్టార్ నుంచి కూలి రాబోతుంది. అయితే కూలి చిత్రానికి సూపర్ స్టార్ తీసుకున్న పారితోషికంతో ఆయన సెన్సేషన్ క్రియేట్ చేసినట్టుగా చెబుతున్నారు. ప్రెజెంట్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటులు కేవలం నలుగురైదుగురు మాత్రమే ఉన్నారు.
ఆ నలుగురికి 200 నుంచి 250 కోట్ల వరకు పారితోషికాలు ఉంటున్నాయి. అందులో షారుఖ్ 200 కోట్ల పారితోషికం తీసుంటున్నారనే టాక్ ఉంది. కానీ ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి కోసం ఆ నిర్మాతలు రజినీకి ఏకంగా 260 నుంచి రూ.280 కోట్ల మధ్యలో పారితోషికం ఇస్తున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం అందుకున్న మొదటి సౌత్ ఇండియా యాక్టర్ రజనీకాంత్ అనే అంటున్నారు. జైలర్ కి 100 కోట్ల పారితోషికం తో పాటుగా లాభాల్లో రజినీకి వాటా ఇచ్చారు. ఇప్పుడు కూలి కి రజినీకాంత్ ఏకంగా ఆ రేంజ్ పారితోషికం తీసుకోవడమే షాకింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.