ఎప్పుడో విడుదల కావాల్సిన ప్రభాస్ రాజా సాబ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక ప్రభాస్ అభిమానులు డిజప్పాయింట్ మోడ్ లో కనిపిస్తున్నారు. దర్శకుడు మారుతి నన్ను ప్రశాంతంగా వదిలేస్తే అదిరిపోయే అవుట్ ఫుట్ మీ చేతుల్లో పెడతాను అంటున్నాడు. కానీ అది ఎప్పుడు జరుగుతుంది. దసరాకా, లేదంటే అనేది అర్ధం కాక అభిమానులు నిరాశలో కనిపిస్తున్నారు.
మే మిడ్ లో రాజా సాబ్ టీజర్ అంటూ మారుతి హింట్ ఇచ్చారు. ప్రభాస్ ఇటలీలో సేదతీరడానికి వెళ్లారు, ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్ ముగించుకుని ప్రభాస్ తిరిగొచ్చారు, అంటే మారుతి రాజా సాబ్ టీజర్ ని రెడీ చెస్తుండొచ్చు, ఇప్పటికే టీజర్ కట్ పూర్తయ్యింది, కానీ ప్రభాస్ డబ్బింగ్ బ్యాలెన్స్ ఉండిపోయింది.
ఇప్పుడు ప్రభాస్ ఇటలీ నుంచి రావడంతో ప్రభాస్ తో డబ్బింగ్ చెప్పించి రాజా సాబ్ టీజర్ ఇవ్వాలని మారుతి ప్లాన్. మరి ప్రభాస్ త్వరగా మారుతికి అందుబాటులోకి వచ్చి ఆ డబ్బింగ్ పూర్తి చేస్తే రాజా సాబ్ టీజర్ వచ్చేస్తుంది, లేదంటే టీజర్ విషయంలోనూ అభిమానులు వెయిట్ చెయ్యక తప్పదు.