అక్కినేని కోడలు, నాగ ఛైతన్య భార్య, ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ప్రెగ్నెంట్? ఇప్పుడిదే అనుమానం అందరిలో ఉంది. ఈమధ్యన శోభిత దూళిపాళ్ల ప్రెగ్నెంట్ అన్న వార్త బాలీవుడ్ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. ఆమె వేవ్స్ సమ్మిట్ లో చీరకట్టులో కనిపించడం, అలాగే ప్రెగ్నెన్సీని కవర్ చేసుకుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఇక్కడ మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అంటూ అనౌన్స్ చెయ్యడంతో శోభిత కూడా ప్రెగ్నెంట్ అయ్యుంటుంది, ఇంకా అనౌన్స్ చెయ్యలేదనే అనుమానాలు మొదలయ్యాయి. గత ఏడాది డిసెంబర్ 5 న నాగ చైతన్య ను వివాహం చేసుకుని అక్కినేని ఇంట అడుగుపెట్టిన శోభిత రీసెంట్ గా చైతు తో కలిసి వేవ్స్ సమ్మిట్ లో పాల్గొంది.
తాజాగా శోభిత ప్రెగ్నెన్సీ వార్తలపై ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం శోభిత వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు, పిల్లల గురించి ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు, అందుకోసం కాస్త సమయం ఉన్నట్లుగా శోభిత తెలియజేసినట్లుగా ఆమె టీమ్ శోభితపై వస్తోన్న ప్రెగ్నెన్సీ రూమర్స్ ని కొట్టిపారేసింది.