బాలీవుడ్ లో ఖాన్ ల త్రయాన్ని తలదన్నేలా పాన్ ఇండియన్ స్టార్ డమ్ అంటే ఏంటో చూపించాడు డార్లింగ్ ప్రభాస్. ఖాన్ లు కపూర్ లు రోషన్ లు చేయలేనిది ఒక తెలుగు స్టార్ చేయగలిగాడు. 1000 కోట్లు అంతకుమించి వసూళ్లను సునాయాసంగా తేగలనని నిరూపించాడు. తొలి మూడు రోజుల్లో 300 కోట్లు కొల్లగొట్టగల సమర్థుడని ప్రూవైంది. అలాంటి ఒక బిగ్గెస్ట్ ఇండియన్ స్టార్ పేరును తన పబ్లిసిటీ పిచ్చి కోసం ఉపయోగించుకుంది సీకే బ్యూటీ దిశా పటానీ. ప్రభాస్ బ్రాండ్ వ్యాల్యూని దిశా స్వలాభం కోసం ఉపయోగించుకోవడం అభిమానులకు నచ్చడం లేదు.
దిశా చేసిన ఆ తప్పుడు పని ఏమిటి? అంటే.. తన మోచేతిపై PD అనే రెండక్షరాల పచ్చబొట్టును పొడిపించుకుంది. దానితో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ పచ్చ బొట్టు అర్థం ఏమిటో డీకోడ్ చేసేందుకు నెటిజనులు తీవ్ర ప్రయత్నాలు చేసారు. P- అంటే ప్రభాస్, D- అంటే దిశా పటానీ అని రెడ్డిటర్లు కనిపెట్టేసారు. దిశా కావాలనే ప్రభాస్ అభిమానులను టీజ్ చేస్తోంది. ముందుగా ప్రభాస్ తో డేట్ లో ఉన్నానని హింట్ ఇచ్చింది. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ని టీజ్ చేయడం ద్వారా సౌత్ లో అమెజాన్ పై బిజ్ ని పెంచాలని ట్రిక్కు ప్లే చేసింది. ఇదంతా అమెజాన్ ప్రైమ్ డే సేల్ పెరిగేందుకు దిశాతో ఆన్ లైన్ పోర్టల్ బిగ్ డీల్ లో భాగం.
ఫ్యాన్స్ ని రెచ్చగొట్టడం ద్వారా సదరు బ్రాండ్ కి పబ్లిసిటీ తేవాలి. అయితే ఇలాంటి ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తే అనవసరంగా నష్టపోతావ్! అంటూ డార్లింగ్ అభిమానులు వార్నింగులు ఇస్తున్నారు. కల్కి 2898 ఏడిలో దిశాకు అవకాశం కల్పించాడు ప్రభాస్. ఇకపై మరో ఛాన్స్ లేనే లేదు! అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ప్రభాస్ తో దిశా పటానీ ప్రేమాయణం ఫేక్. అందువల్ల ఈ ట్రిక్స్ వర్కవుట్ కావని హెచ్చరిస్తున్నారు.