సమంత రెండో పెళ్లి ముచ్చట ఏదో విధంగా మీడియాలో కనిపిస్తూనే ఉంది, సమంత నిర్మించిన శుభం చిత్ర ఇంటర్వ్యూలో పర్సనల్ లైఫ్ పై ఎలాంటి ప్రశ్నలు అడగొద్దు, నేను రియాక్ట్ అవ్వను అంటూ తప్పించుకున్న సమంత తన సెకండ్ మ్యారేజ్ పై వస్తున్న వార్తలను కన్ ఫర్మ్ చేసినట్టుగా కనిపిస్తుంది.
ఆమె నిర్మించిన శుభం జర్నీ ఫొటోస్ షేర్ చేస్తూ అందులో ఆమె డేటింగ్ లో ఉంది అన్న ప్రచారం జరుగుతున్న దర్శకుడు రాజ్ నిడమోరు ఫొటోస్ ను షేర్ చెయ్యడం చూసి సమంత పర్సనల్ లైఫ్ పై ఆమె ఇలా ఫొటోస్ తో కొత్త ఆరంభం అంటూ హింట్ ఇస్తుంది అంటూ మాట్లాడుకుంటున్నారు నెటిజెన్స్.
బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడమోరు తో సమంత డేటింగ్ లో ఉంది అనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నా సమంత మాత్రం వాటి పై ఎక్కడా క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ మైంటైన్ చేస్తుంది, కానీ ఇలా ఫొటోస్ రూపంలో న్యూ బిగినింగ్ అంటూ కన్ ఫర్మ్ చేస్తుంది అని గుసగుసలాడుకుంటున్నారు.