యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే రాబోతుంది. మే 20 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే. మరి ఎన్టీఆర్ బర్త్ డే కి హిందీ వార్ 2 నుంచి ఎలాంటి సర్ ప్రైజ్ రాకపోవచ్చు, ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళకు అలాంటి సెంటిమెంట్స్ పెద్దగా ఉండవు. కానీ ప్రశాంత్ నీల్ డ్రాగన్ నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్ సిద్దమవుతుంది.
ఎన్టీఆర్ డ్రాగన్ లుక్ తో పాటుగా స్పెషల్ గా డ్రాగన్ గ్లింప్స్ ని సిద్ధం చేస్తున్నారని సమాచారం. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ ఏడాది అలాంటి ఇలాంటి ట్రీట్ కాదు గూస్ బంప్స్ తెప్పించే ట్రీట్స్ సిద్ధమవుతున్నాయి. మరోపక్క అదే రోజు కొరటాల శివ దేవర కు సంబందించిన అనౌన్సమెంట్ వీడియో ని సిద్ధం చేస్తున్నారనే వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజింగ్ గా మారింది.
గత ఏడాది దేవర తో పాన్ ఇండియా పవర్ ని ప్రూవ్ చేసిన ఎన్టీఆర్ దేవర 2 సెట్ లోకి ఎప్పుడు అడుగుపెడతారా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. దేవర 500 కోట్లు మాత్రమే కొల్లగొట్టినా దేవర 2 పై విపరీతమైన హైప్ ఉంది. కొద్దిరోజుల క్రితం దేవర 2 ఉండకపోవచ్చని ఊహాగానాలు నడిచాయి కానీ వాటికి ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ చెక్ పెట్టారు.
సో ఎన్టీఆర్ బర్త్ డే కి నీల్ ప్రాజెక్ట్ నుంచి అలాగే దేవర 2 నుంచి స్పెషల్ గా ఫ్యాన్స్ కోసం అదిరిపోయే ట్రీట్స్ రెడీ అవుతున్నాయన్నమాట.