హీరో శ్రీవిష్ణు కి కామెడీ జానర్ కలిసొచ్చినట్టుగా సీరియస్ జానర్ కథలు కలిసిరాలేదనే చెప్పాలి. శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్, ఆయన మాటలోని యాస, కామెడీ టైమింగ్ అన్ని శ్రీవిష్ణు ని హీరోగా నిలబెట్టాయి. కామెడీని తప్పించి ఏ జానర్ లో సినిమా చేసినా శ్రీవిష్ణు కి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి.
సామజవరగమన తో హిట్ అందుకున్న శ్రీవిష్ణు రీసెంట్ గా స్వాగ్ తో డిజాస్టర్ చవి చూసాడు. ఇప్పుడు శ్రీవిష్ణు తన పాత కాదు కలిసోచ్చిన జానర్ లోకి వచ్చేసాడు. #సింగిల్ అంటూ మే 9 న ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. #Single టీజర్, ట్రైలర్ అన్ని కామెడీకి గా కనిపించడంతో ఈసారి శ్రీవిష్ణు కి హిట్ పక్కా అనే టాక్ మొదలైంది.
మరోపక్క హీరోయిన్స్ ఇవాన, కేతిక శర్మ తో కలిసి శ్రీవిష్ణు చేస్తోన్న #single ప్రమోషన్స్ అన్ని సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. మే 9న సమంత నిర్మించిన శుభం కూడా విడుదల కాబోతుంది. అయితే ఆ చిత్రానికి హిట్ టాక్ పడితే తప్ప జనాలు థియేటర్స్ కు వెళ్లరు. కారణం శుభం లో అందరూ కొత్త నటులే కాబట్టి.
ఇక శ్రీవిష్ణు అభిమానులే కాదు కామెడీని లైక్ చేసే ఏ ప్రేక్షకుడు అయినా #Single కోసం థియేటర్ కి వెళ్లాల్సిందే. చూద్దాం శ్రీవిష్ణు కి #Single ఎంత హెల్ప్ అవుతుందో అనేది.