తమన్నా భాటియా లేటెస్ట్ పాన్ ఇండియా ఫిలిం ఓదెల 2. సంపత్ నంది దర్శకత్వంలో ఓదెల చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కించిన ఓదెల 2 ఏప్రిల్ 17 న థియేటర్స్ లో విడుదలైంది. ఈ చిత్రానికి అటు క్రిటిక్స్ నుంచి ఇటు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే థియేటర్స్ లో నిరాశపరిచిన ఈ చిత్రం ఇప్పుడు మూడు వారాలు తిరిగేలోపే ఓదెల ఓటీటీ పార్ట్నర్ స్ట్రీమింగ్ లోకి తెచ్చేందుకు సిద్దమైంది. అది కూడా ఈరోజు మిడ్ నైట్ మే 8 అంటే రేపు గురువారం నుంచి ఓదెల 2 స్ట్రీమింగ్ కాబోతుంది.
ఓదెల 2 ఓటీటీ పార్ట్నర్ అమెజాన్ ప్రైమ్ వారు ఓదెల 2 ని రేపటినుంచి అంటే మే 8 నుంచి స్ట్రీమింగ్ చెయ్యనున్నట్లుగా ప్రకటించారు. దానితో ఫ్యామిలీ ఆడియన్స్ షాకవుతున్నారు. అదేమిటి మరీ మూడు వారాలకే ఓటీటీలోకా అంటూ ఓదెల 2 ఓటీటీ స్ట్రీమింగ్ పై రియాక్ట్ అవుతున్నారు నెటిజెన్స్.