Advertisement
Google Ads BL

కన్నప్ప కోసం విష్ణు మంచు ప్లానింగ్ అదుర్స్


డైనమిక్ స్టార్Global Promotions For Kannappa  విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ను ఓ మైలు రాయి చిత్రంగా మలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్‌ను స్టడీ చేస్తూ గ్లోబల్‌గా ప్రమోట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. విష్ణు మంచు నటించిన ఈ హిస్టారికల్ మూవీ ప్రమోషన్స్‌ను అమెరికా నుంచి ప్రారంభించబోతున్నారు. కన్నప్ప USA టూర్ మే 8న న్యూజెర్సీలో ప్రారంభం కానుంది. అక్కడ విష్ణు నార్త్ బ్రున్స్‌విక్‌లోని రీగల్ కామర్స్ సెంటర్‌లో అభిమానులతో ముచ్చటించనున్నారు.

Advertisement
CJ Advs

మే 9న డల్లాస్‌కు బయలుదేరి వెళ్లి సాయంత్రం 7 గంటలకు గెలాక్సీ థియేటర్స్ గ్రాండ్‌స్కేప్, ది కాలనీ, టెక్సాస్ లో ప్రేక్షకులతో సందడి చేయనున్నారు. ఈ పర్యటన మే 10న శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ముగుస్తుంది. అక్కడ ఆయన ఉదయం 10:30 గంటలకు సినీ లాంజ్ ఫ్రీమాంట్ 7 సినిమాస్‌ను సందర్శిస్తారు. ఈ చిత్రం ఓవర్సీస్ విడుదలను వాసారా చూసుకుంటోంది. అనంతరం ఇండియాకు తిరిగి రానున్న విష్ణు.. దేశంలోని పలు నగరాల్ని చుట్టి రానున్నారు.

ఆధ్యాత్మిక తీర్థయాత్రలు, అన్ని వర్గాల ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి, అన్ని ప్రాంతాల మీడియాతో విష్ణు మంచు ఇంటరాక్ట్ కానున్నారు. కన్నప్ప నుంచి వచ్చిన భక్తి గీతం శివా శివా శంకరా విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని లవ్ ట్రాక్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి కన్పప్ప ట్రైలర్‌పై ఉందన్న సంగతి తెలిసిందే. ట్రైలర్ రిలీజ్‌తో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్నంటుతాయి. జూన్ 27న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ఇలా పలు భాషలలో కన్నప్ప చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.

Vishnu Manchu Global Promotions For Kannappa :

Global Promotions For Kannappa 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs