తమిళంలో స్టార్ హీరోలు వరసగా ఫెయిల్ అవుతున్నారు. స్టార్ హీరోల సినిమాలు కేవలం అభిమానుల కోసమే దర్శకులు తెరకెక్కిస్తున్నారా అనెలా ఉంటున్నాయి తప్ప కంటెంట్ ని పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. చాలామంది టాప్ దర్శకులు కూడా స్టార్ హీరోల హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తున్నారు, అదే తమిళ తంబీలకు బాగా నచ్చుతుంది.
కానీ తమిళ హీరోల సినిమాలు ఏ ఒక్కటి తెలుగులో హిట్ అవవడం లేదు. విజయ్ వారసుడు, అజిత్ తూనీవు, పట్టుదల, నిన్నగాక మొన్నొచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ, సూర్య రెట్రో ఇవన్నీ తెలుగులో ఫేయిల్, కానీ తమిళనాట బిగ్ హిట్స్. ఆ చిత్రాలు కేవలం ఆయా హీరోల ఎలివేషన్ సీన్స్ తప్ప మరేది అందులో కనిపించదు.
గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఇలాంటి తిప్పలే తెచ్చారు తమిళ దర్శకులు. ఇప్పుడు అజిత్, విజయ్, సూర్య లాంటి హీరోలకు కూడా అలాంటి దర్శకులే తగులుతున్నారు. హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తే ఫ్యాన్స్ పడిపోతారనే కాన్సెప్ట్ ని దృష్టిలో పెట్టుకుంటున్నారు. గతంలో తమిళ సినిమా అంటే రా అండ్ రస్టిక్, ఒరిజినాలికి దగ్గరగా ఉండేది, అందుకే అక్కడ బ్లాక్ బస్టర్స్ పడేవి.
కానీ ఇప్పుడు హీరో ఫైట్ చేసినా, లేదంటే స్టెప్స్ వేసినా సరిపెట్టుకుంటున్నారు ఆడియన్స్. అందుకే విజయాలు కొరవడ్డాయి. రీసెంట్ గా విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీ, రెట్రో రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు. కానీ అవి తమిళనాట పెద్ద హిట్స్ గా నిలిచాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ 250 కోట్లు కొల్లగొడితే.. రెట్రో ప్రెజెంట్ థియేటర్స్ లో దూసుకుపోతుంది.
మరి దీనిని బట్టి తమిళ్ ఆడియన్స్ కి కేవలం హీరోయిజం చూపిస్తే సరిపోతుంది, అందుకే దర్శకులు కూడా అదే కోవలో సినిమాలు చేస్తున్నారు అంటున్నారు విశ్లేషకులు.