అల్లు అర్జున్-అట్లీ కాంబోలో మొదలు కాబోయే చిత్రం రెగ్యులర్ షూటింగ్ కోసం అల్లు అర్జున్ మేకోవర్ అవుతున్నారు. అట్లీ తో చెయ్యబోయే AA 22 కోసం అల్లు అర్జున్ మేకోవర్ ఎలా ఉండబోతుంది, ఆయన హెయిర్ స్టయిల్ తో సహా రీసెంట్ గా వేవ్స్ 2025 ఈవెంట్ లో బయటపడింది. అంతేకాకుండా సూపర్ స్టార్ మహేష్, ఎన్టీఆర్ లతో వర్క్ చేసిన ట్రైనర్ ని పెట్టుకుని అల్లు అర్జున్ కొత్త లుక్ కోసం శ్రమిస్తున్నాడు.
అయితే అల్లు అర్జున్-అట్లీ చిత్రం ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉండబోతుంది అనేది అనౌన్సమెంట్ వీడియోతోనే క్లారిటీ ఇచ్చింది ఈ క్రేజీ కాంబో. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా ముగ్గురు కనిపిస్తారు. అందులో ఒకటి సమంత, రెండోవారు మృణాల్ ఠాకూర్ అనే ప్రచారం జోరుగా జరిగింది. సమంత వన్ ఆఫ్ ద హీరోయిన్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు గట్టిగా వినిపించాయి.
కానీ సమంత మాత్రం అల్లు అర్జున్-అట్లీ మూవీలో తను నటించడం లేదు అని క్లారిటీ ఇచ్చింది. ఆమె నిర్మించిన శుభం ఇంటర్వ్యూలో భాగంగా అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్ లో తాను నటిస్తున్నాను అనే వార్తల పై రియాక్ట్ అయ్యింది. నేను ఆ చిత్రంలో నటిస్తున్నాను అని వస్తున్న వార్తలో ఎంత మాత్రం నిజంలేదు. అట్లీ నాకు మంచి ఫ్రెండ్, ఫ్యూచర్ లో అట్లీ చిత్రంలో అవకాశం వస్తే నటిస్తాను అంటూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది సమంత.