ఫైనల్లీ ఎన్నో ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న హరిహర వీరమల్లు షూటింగ్ ను పవన్ కళ్యాణ్ పూర్తి చేసేసారు. రెండు పార్టుగా తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు ఫస్ట్ పార్ట్ షూట్ ఎట్టకేలకు ఫినిష్ అయినట్లుగా మేకర్స్ ఆనందంతో ఇచ్చిన అప్ డేట్ చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీ గా ఫీలవుతున్నారు. అవ్వరా మరి ఎన్నో ఏళ్లుగా సాగుతున్న షూటింగ్ అది.
రెండు రోజుల క్రితమే వీరమల్లు సెట్ లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఈరోజుతో హరి హర వీరమల్లు షూటింగ్ ఫినిష్ చేసేసినట్లుగా ప్రకటించారు. మరి షూటింగ్ ఫినిష్ అయితే ఇకపై వీరమల్లు రిలీజ్ డేట్ రావడమే తరువాయి, షూటింగ్ పూర్తయ్యింది అది చాలు, ఇక రిలీజ్ డేట్ ఆలస్యం ఏముంటుంది అని పవన్ ఫ్యాన్స్ ధీమా పోతున్నారు.
అయితే ఇప్పుడు హరి హర వీరమల్లు రిలీజ్ తేదీ వీరమల్లు డిజిటల్ రైట్స్ ని దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ చేతిలోకి వెళ్ళింది అనే న్యూస్ నడుస్తుంది. అమెజాన్ ప్రైమ్ పట్టుబడితే వీరమల్లు ఖచ్చితంగా మే 30 వస్తుంది, లేదంటే జూన్ రెండో వారంలో హరి హర వీరమల్లు రాక ఖాయమవుతుంది అంటున్నారు. ఇది పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ కాక ఇంకేమిటి.