హరి హర వీరమల్లు షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్. పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితమే వీరుమల్లు సెట్ లోకి అడుగుపెట్టారు. బ్యాలెన్స్ ఉన్న రెండు రోజుల షూటింగ్ ఫినిష్ అయినట్లుగా తెలుస్తుంది. మరోపక్క హరిహర వీరమల్లు రిలీజ్ తేదీపై అందరిలో ఆత్రుత కనిపిస్తుంది. ఇప్పటికే నిర్మాత రత్నం హరి హర వీరమల్లు ట్రైలర్, సాంగ్స్ పై అంచనాలు పెంచే అప్ డేట్ ఇచ్చేసారు.
మే 30 న హరి హర వీరమల్లుని రిలీజ్ చెయ్యాలని వీరమల్లు డిజిటల్ పార్ట్నర్ అమెజాన్ ప్రైమ్ ఒత్తిడి చేస్తుంది అనే టాక్ వినబడుతుంది. ఒకవేళ అమెజాన్ ప్రైమ్ వారు ఒప్పుకుంటే జూన్ రెండో వారంలో హరి హర వీరమల్లు ను విడుదల చేసే ఏర్పాట్లు చేస్తారని, అప్పటికి కూల్ గా పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసుకుని ప్రమోషన్స్ చేసుకోవచ్చని మేకర్స్ ఆలోచనగా చెబుతున్నారు.
అమెజాన్ ప్రైమ్ వారు ఇప్పటికే హరి హర వీరుమల్లు మేకర్స్ పై ఒత్తిడి పెట్టడంతోనే మే 30 న వీరమల్లును రెడీ చేసేలా పనులు చకచకా పనులు ముగిస్తున్నారట. సో హరి హర వీరమల్లు మేకర్స్-అమెజాన్ ప్రైమ్ సంస్థతో చర్చించి త్వరలోనే వీరమల్లు రిలీజ్ తేదీని అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.