Advertisement
Google Ads BL

ఇండ‌స్ట్రీ నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెట్టిన న‌టుడు


జాతీయ ఉత్త‌మ న‌టుడిగా ఇర్ఫాన్ ఖాన్ న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న‌కు అభిమానులు కాని వారు లేరు. అత‌డు ఎనిమిదేళ్ల పాటు క్యాన్స‌ర్ తో పోరాడి చివ‌రికి తుది శ్వాస విడిచాడు. అయితే కీ.శే. ఇర్ఫాన్ కుటుంబం నుంచి న‌ట‌వార‌సుడు సినీప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించ‌డం అనూహ్య‌మైన‌ది. అత‌డి కుమారుడు బాబిల్ ఖాన్ న‌టుడిగా నిరూపించుకుని కెరీర్ ప‌రంగా ముందుకు సాగుతున్నాడు.

Advertisement
CJ Advs

అయితే అత‌డు అనూహ్యంగా డ‌జ‌ను మంది బాలీవుడ్ స్టార్ల పేర్ల‌ను ప్ర‌స్థావిస్తూ లైవ్ లో ఎంతో భావోద్వేగానికి గురై విప‌రీతంగా ఏడ్చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. బాబిల్ అంత‌గా ఏడ్చేయ‌డానికి కార‌ణ‌మేమిటో అర్థం చేసుకోవ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌లేదు. బాలీవుడ్ అంత ఫేక్ ఇంకొక‌టి లేదు. ఇక్క‌డ న‌టులు ఫ‌* అంటూ స‌హ‌చ‌రుల‌ను ఉద్ధేశించి అత‌డు తిట్టాడు. అనన్య పాండే, అర్జున్ కపూర్, సానాయ కపూర్, సిద్ధాంత్ చతుర్వేది, రాఘవ్ జుయల్, ఆదర్శ్ గౌరవ్, అరిజిత్ సింగ్ వంటి ప్రముఖుల పేర్ల‌ను ప్ర‌స్థావిస్తూ వారితో అత‌డికి వ‌చ్చిన చిక్కేంటో కానీ లైవ్ లో ఎమోష‌న్ ని ఆపుకోలేక‌పోయాడు. తీవ్రంగా ఏడ్చాడు. ఇది చూసాక క‌చ్ఛితంగా స‌హ‌చ‌రులు అత‌డిని గేలి చేసార‌ని, ఇబ్బందికి గురి చేసార‌ని అంతా భావించారు. అయితే అత‌డు భావోద్వేగానికి గురైన వీడియోని వెంట‌నే తొల‌గించి ఇన్ స్టా నుంచి బాబిల్ స్కిప్ కొట్టాడు.

అయితే అత‌డి త‌ల్లి సుత‌పా వెంట‌నే డ్యామేజ్ కంట్రోల్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ, బాబిల్ మాన‌సిక ప‌రిస్థితి మెరుగ‌వుతోంద‌ని, అత‌డు సేఫ్ గానే ఉన్నాడ‌ని చెప్పారు. నిజానికి స‌హ‌న‌టీన‌టుల పేర్ల‌ను అత‌డు ప్ర‌స్థావించ‌డానికి కార‌ణం వేరు. బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు కొంద‌రు స‌హ‌క‌రిస్తున్నార‌ని కూడా ఆమె అన్నారు. బాబిల్ అయినా లేదా ఎవ‌రైనా కొత్త న‌టుడు సినీప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకోక ముందు ఎదుర్కొనేవి ఇలానే క‌ఠినంగా ఉంటాయ‌ని ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నారు. ఇక్క‌డ ఒక‌సారి నేము ఫేము వ‌చ్చాకే గౌర‌వం ద‌క్కుతుంది. అంత‌కుముందు చాలా అవ‌మానాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాబిల్ ఘ‌ట‌న‌ ఒక ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే

The actor who exposed the true nature of the industry:

Babil Khan recent Instagram video sparked concern among social media users
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs